Skip to main content

Synopsis

గర్భాశయ ఫైబ్రాయిడ్లు అంటే ఏమిటి? గర్భాశయ ఫైబ్రాయిడ్ కోసం కారణాలు, లక్షణాలు మరియు చికిత్సలు ఏమిటి? మరింత తెలుసుకోవడానికి చదవండి

గర్భాశయ ఫైబ్రాయిడ్ లు అంటే ఏమిటి?

గర్భాశయం యొక్క కండరాల కణాల్లో పెరిగే కాన్సర్ కానీ కణుతులు గర్భాశయ ఫైబ్రాయిడ్ లు. ఒకటి నుంచి చాలావరకు, మహిళలు విభిన్న పరిమాణాలలో ఉండే విభిన్న సంఖ్యలో ఫైబ్రాయిడ్లను కలిగి ఉండవచ్చు. ఇది ఒక చిన్న గింజ నుంచి పెద్ద ద్రవ్యరాశి ఉండే పదార్ధంగా ఉండవచ్చు. సరైన పరీక్ష లేకుండా పెల్విక్ పరీక్షల సమయంలో ఇవి యాదృచ్చికంగా కనిపిస్తాయి. మరియు ఆ తరువాత, ఈ ఫైబ్రాయిడ్ల ఉనికిని ధృవీకరించడానికి ఇమేజింగ్ మరియు ల్యాబ్ టెస్ట్ లు సాధారణంగా నిర్వహించబడతాయి.

మెనోపాజ్ వచ్చిన మహిళల్లో 20-40% మంది ఫైబ్రాయిడ్లతో బాధపడుతున్నారు. కొంత మంది వైద్యుల ప్రకారం, ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చునని అంచనా. వాస్తవానికి, ఇవి ఉన్న మహిళల్లో 5-10% మంది మాత్రమే వాస్తవంగా ఏవైనా లక్షణాలను ఎదుర్కొంటారు. సాధారణంగా, ఫైబ్రాయిడ్ల స్వభావం ప్రమాదకరం కాదు మరియు అవి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాప్తి చెందవు, అయితే అవి లక్షణాలను చూపించడం ప్రారంభించినప్పుడు, తీవ్రంగా ఉండవచ్చు. ఫైబ్రాయిడ్లు ఉన్న మహిళలు ఎలాంటి లక్షణాలను అనుభవించరు కనుక, ఇది పరిస్థితిని మరింత తీవ్రం చేస్తుంది. అయితే, తరచుగా ఎలాంటి లక్షణాలను అనుభవించని మహిళలు వాటిని ఎదుర్కోవడానికి గణనీయమైన జీవనశైలి మార్పులు చేయవలసి ఉంటుంది.

గర్భాశయ ఫైబ్రాయిడ్లకు కారణం ఏంటి?

ఫైబ్రాయిడ్ల అబివృద్ధహయి చెందడం వెనుక స్పష్టమైన కారణం లేదు, అయితే ఫైబ్రాయిడ్ల ఏర్పడటాన్ని ప్రభావితం చేసే అనేక కారకాలు ఉన్నాయి.

గర్భాశయ ఫైబ్రాయిడ్లలో ఇవి ఉంటాయి:

1. హార్మోన్లు– ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టిరాన్ సహా హార్మోన్లు మహిళల అండాశయాల ద్వారా ఉత్పత్తి అవుతాయి. ఈ హార్మోన్లు ప్రతి ఋతుచక్రం సమయంలో గర్భాశయ లైనింగ్ పునరుత్పత్తికి దారి తీస్తాయి మరియు ఫైబ్రాయిడ్ల పెరుగుదలను ఉత్తేజపరచవచ్చు.

2. కుటుంబ చరిత్ర- ఫైబ్రాయిడ్ల కండిషన్ వంశపారంపర్యంగా ఉండవచ్చు. మీ అమ్మమ్మ, సోదరి మరియు అమ్మతో సహా మీ కుటుంబ సభ్యులలో ఫైబ్రాయిడ్ల చరిత్ర ఉన్నట్లయితే, అప్పుడు అది మీకు కూడా అభివృద్ధి చెందవచ్చు.

3. గర్భధారణ- గర్భధారణ వల్ల మహిళ శరీరంలో ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టిరాన్ హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది, దీని ఫలితంగా ఫైబ్రాయిడ్లు పెరుగుతాయి, మరియు గర్భధారణ సమయంలో వేగంగా అభివృద్ధి చెందవచ్చు.

ఇందులో గర్భాశయ ఫైబ్రాయిడ్లకు లక్షణాలు ఏంటి?

ఈ లక్షణాలు పూర్తిగా ఒక మహిళకు ఉన్న ఫైబ్రాయిడ్ల సంఖ్యపై ఆధారపడి ఉంటాయి. వాటి స్థానం మరియు పరిమాణం కూడా ఒక ప్రధాన అంశం. ఉదాహరణకు, సబ్ మ్యూకోసల్ ఫైబ్రాయిడ్లు భారీ ఋతుస్రావానికి దారి తీయవచ్చు మరియు గర్భధారణలో సమస్యలు తలెత్తవచ్చు.

చిన్న కణుతులు ఉన్న మహిళలు లేదా ఇప్పటికే మెనోపాజ్ ను పొందిన వారు, ఎలాంటి లక్షణాలను ఎదుర్కొనకపోవచ్చు, ఎందుకంటే వాటి ఎదుగుదలకు దోహదపడే ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టిరాన్ స్థాయిలు మెనోపాజ్ తరువాత తగ్గిపోవడం వలన ఫైబ్రాయిడ్ల ఎదుగుదల తగ్గి రోగ లక్షణాలు తక్కువగా ఉండవచ్చు.

గర్భాశయ ఫైబ్రాయిడ్ల లక్షణాలు:

1. దీర్ఘకాలిక, భారీ లేదా అసాధారణ ఋతుస్రావం, ఇది తరచుగా రక్తహీనతకు దారి తీస్తుంది.

2. కటి భాగంలో తీవ్రమైన నొప్పి. వెన్ను మరియు కాళ్ళ నొప్పి కూడా చాలా సందర్భాలలో ఒక లక్షణంగా చెప్పవచ్చు.

3. శారీరిక సంభోగం సమయంలో నొప్పిగా ఉంటుంది.

4. మూత్రాశయంలో ఒత్తిడి వల్ల తరచుగా మూత్ర విసర్జన చేయాలనే కోరిక కలుగుతుంది.

5. ప్రేగులో ఒత్తిడి కారణంగా మలబద్ధకం ఏర్పడుతుంది.

6. పొత్తికడుపు వాపు ఉంటుంది.

గర్భాశయ ఫైబ్రాయిడ్లు ఏ విధంగా నిర్ధారించబడతాయి?

ఖచ్చితమైన మరియు సవిస్తరమైన రోగ నిర్ధారణ కొరకు మీరు నిర్దిష్ట పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది, దీనిలో ఇవి ఉంటాయి –

1. అల్ట్రా సౌండ్ స్కాన్-

ఇది గర్భాశయ అంతర్గత నిర్మాణాలు మరియు ఫైబ్రాయిడ్ల ఉనికిని విశ్లేషించడంలో సహాయపడుతుంది. ఈ సందర్భంలో, ట్రాన్స్ వెజీనల్ అల్ట్రా సౌండ్ స్కాన్ మెరుగైన రోగ నిర్ధారణ కోసం స్పష్టమైన చిత్రాలను అందించవచ్చు.

2. పెల్విక్ ఎంఆర్ఐ-

పెల్విక్ ఎంఆర్ఐ అనేది లోతైన ఇమేజింగ్ టెస్ట్ ప్రొసీజర్, ఇది మహిళ గర్భాశయం, అండాశయాలు మరియు ఇతర కటి అవయవాల స్పష్టమైన చిత్రాలను ఉత్పత్తి చేస్తుంది.

గర్భాశయంలో ఫైబ్రాయిడ్లకు చికిత్స ఏమిటి?

మీ ఫైబ్రాయిడ్లకు సంబంధించిన సమస్యలతో మీరు మీ వైద్యుడిని సందర్శించిన తరువాత, మీ వయస్సు, మీ ఫైబ్రాయిడ్ల పరిమాణం మరియు మీ మొత్తం ఆరోగ్యానికి అనుగుణంగా ఫైబ్రాయిడ్ల చికిత్స కొరకు ఆయన ఒక ప్లాన్ ను అభివృద్ధి చేస్తారు.

మీరు వివిధ రకాలైన చికిత్సలు చేయించుకోవాల్సి ఉంటుంది,

ఫైబ్రాయిడ్ చికిత్సలో ఇవి ఉంటాయి:

మెడిసిన్:

గర్భాశయంలో ఫైబ్రాయిడ్ల చికిత్స కొరకు, మీ హార్మోన్ల స్థాయిలను నియంత్రించడం కొరకు మందులు సిఫారసు చేయబడతాయి, తద్వారా వాటి ఎదుగుదల తగ్గిపోతుంది.

ల్యూప్రోలిడ్ (లెప్రాన్)తో సహా గ్లోనాడోట్రోఫిన్ విడుదల చేసే హార్మోన్ (జీఎన్ ఆర్ హెచ్) అగోనిస్టులు ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టిరాన్ హార్మోన్ల స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

సెట్రోరెలిక్స్ ఎసిటేట్ మరియు గానిల్రెలిక్స్ ఎసిటేట్ తో సహా జీఎన్ఆర్ హెచ్ అంటగోనిస్టులు కూడా ఫైబ్రాయిడ్లను కుదించడానికి సహాయపడతాయి.

ఋతుస్రావం మరియు నొప్పిని నియంత్రించడంలో సహాయపడే ఇతర ఎంపికలు కూడా ఉన్నాయి, అయితే అవి ఫైబ్రాయిడ్లను కుదించవు లేదా తొలగించవు. వీటిలో ఇవి ఉంటాయి:

1. గర్భనిరోధక మాత్రలు

2. ప్రొజెస్టిరాన్ హార్మోన్ విడుదల చేసే గర్భాశయాంతర పరికరం (ఐయూడి)

3. ఇబుప్రొఫీన్ తో సహా నొప్పి నుంచి ఉపశమనం కలిగించే చిట్టీ లేకుండా లభించే(వోటీసీ) యాంటీ ఇన్ఫ్లమేటరీ నొప్పిని తగ్గించే మందులు

శస్త్రచికిత్స-

శస్త్రచికిత్స ద్వారా ఎక్కువగా మరియు బాగా పెరిగిన వాటిని తొలగించవచ్చు. ఈ తొలగింపు ప్రక్రియను మయోమెక్టోమీ అంటారు, దీనిలో గర్భాశయాన్ని యాక్సెస్ చేసుకోవడానికి మరియు ఎదిగిన ఫైబ్రాయిడ్లను తొలగించడానికి పొత్తికడుపు భాగంలో పెద్ద గాటును పెడతారు. చిన్నగా గాటు పెట్టి, శస్త్రచికిత్స పరికరాలు మరియు కెమెరాని లోపలికి పంపించి కూడా లాప్రోస్కోపి చేయవచ్చు. అయితే శస్త్రచికిత్స తరువాత ఫైబ్రాయిడ్లు పెరిగే అవకాశం ఉంది.

ఈ ప్రక్రియ తరువాత కూడా, మీ పరిస్థితి తగ్గనట్లయితే మరియు ఇతర చికిత్సలు పనిచేయనట్లయితే, అప్పుడు మీ స్పెషలిస్ట్ హిస్టరెక్టొమి చేయవచ్చు. అయితే, ఈ ప్రక్రియలో భవిష్యత్తులో సహజంగా పిల్లల్ని కనకుండా మిమ్మల్ని నిషేధించే గర్భాశయాన్ని తొలగించడం ఇమిడి ఉంటుంది.

 

మీరు మాతో చేరవచ్చు FacebookInstagramTwitterLinkedinYoutube & Pinterest

మీ గర్భం మరియు సంతానోత్పత్తి ప్రశ్నల కోసం ఈ రోజు దేశంలోని ఉత్తమ సంతానోత్పత్తి నిపుణుల బృందంతో మాట్లాడండి.

Call now :- 18003092323

 

Comments

Tools to help you plan better

Get quick understanding of your fertility cycle and accordingly make a schedule to track it

© 2024 Indira IVF Hospital Private Limited. All Rights Reserved. T&C Apply | Privacy Policy