Skip to main content

Synopsis

అండాశయ తిత్తులు చిన్న కణితులు, అవి నిరపాయమైనవి మరియు ఆకస్మికంగా అదృశ్యమవుతాయి. అండాశయ తిత్తులు యొక్క కారణాలు మరియు చికిత్స గురించి మరింత తెలుసుకోవడానికి వ్యాసం చదవండి

అండాశయ తిత్తి (అండాశయ సిస్ట్ లు) సాధారణంగా గుర్తించబడవు మరియు అల్ట్రాసౌండ్ సమయంలో యాదృచ్ఛికంగా కనుగొనబడతాయి. చాలా సందర్భాలలో ఈ చిన్న గడ్డలు నిరాపాయమైనవి మరియు వాటంతట అవే అదృశ్యమవుతాయి. అయితే, కొన్ని సార్లు శస్త్ర చికిత్స అవసరం అవుతుంది.

నిర్వచనం: అండాశయ తిత్తి అంటే ఏంటి?

అండాశయంలో సిస్ట్ లు అనేవి ఒక సాధారణ, నిరపాయమైన మహిళా పాథాలజి, ఇది ఏ వయసులోనైనా మహిళలందరిని ప్రభావితం చేస్తుంది. గణాంకాల ప్రకారం, 5-7% మంది మహిళలలో వారి జీవితంలో కనీసం ఒక్కసారి అండాశయ సిస్ట్ అభివృద్ధి చెందుతుంది.

రెండు రకాలైన సిస్ట్ లు ఉన్నాయి:

ఫంక్షనల్ సిస్ట్ లు –

ఫంక్షనల్ సిస్ట్ లు మహిళ రుతుక్రమం మరియు అండాశయం పనితీరుతో ముడిపడి ఉంటాయి. అండాశయాల్లో, అండాలను కలిగి ఉండేవాటిని ఫోలికల్స్ అంటారు. ప్రతి ఫోలికల్ లో ఒక అండం ఉంటుంది. ఋతుచక్రం అంతటా, ఈ చిన్న ఫోలికల్స్ పెద్దవి అవుతాయి. అండోత్సర్గ సమయంలో, అత్యంత పరిణతి చెందిన ఫోలికల్ ఎంచుకోబడుతుంది మరియు అండాలను నాళాల్లోనికి విడుదల చేస్తుంది. కేవలం అండోత్సర్గము చేసిన ఫోలికల్స్ చక్రం చివరి వరకు తిరోగమనం చెంది, ఆ తరువాత అదృశ్యమవుతాయి. కానీ కొన్నిసార్లు ఒక అండోత్సర్గము జరుగక, పెరుగుతూనే ఉంటాయి (అది 5 సెం. మీ వ్యాసార్ధాన్ని చేరుకోగలదు) లేదా తగ్గడానికి బదులుగా పసుపు శరీరాన్ని కొనసాగించవచ్చు.
అసాధారణ మార్పులు ఫంక్షనల్ అండాశయ సిస్ట్ ఏర్పడటానికి దారి తీస్తుంది. 90% కేసుల్లో, ఈ సిస్ట్ సుమారు రెండు నెలల్లో దానంతట అదే అదృశ్యమవుతుంది. మెనోపాజ్ సమయంలో, ఇక అండోత్సర్గము ఉండదు. అందువల్ల ఫంక్షనల్ సిస్ట్ ల ప్రమాదం తక్కువగా ఉంటుంది.

ఆర్గానిక్ సిస్ట్ లు-

ఈ వాపు అండాశయం యొక్క కణజాలం నుంచి ఏర్పడతాయి. అవి పెద్దవి కావొచ్చు మరియు యాదృచ్ఛికంగా తిరోగమనం చెందవచ్చు. ఈ పుండ్లలో ఎక్కువభాగం నిరపాయమైనవి అయితే, సుమారు 10% మంది “బోర్డర్ లైన్” లేదా కాన్సర్ కావొచ్చు అని చెబుతారు. అనేక రకాలు ఉన్నాయి, అయితే అత్యంత సాధారణమైనవి:

 సెరస్ సిస్ట్ లు: వాటిలో నీరు వంటి ద్రవం ఉంటుంది. ఇవి అత్యంత సాధారణమైనవి.

 శ్లేష్మం కలిగి ఉన్న శ్లేష్మ సిస్ట్ లు.

 డెర్మాయిడ్ సిస్ట్ లు, దీనిలో జుట్టు, పళ్ళు, చిన్న ఎముకలు ఉంటాయి. ఇవి అండాలుగా మారడానికి ఉద్దేశించిన పరిపక్వత చెందని కణాల నుంచి అభివృద్ధి చెందుతాయి. ఇవి యువతుల్లో ఎక్కువగా ఏర్పడతాయి.

 ఎండోమెట్రియాటిక్ సిస్ట్ లు: ఇవి ఎండోమెట్రియాసిస్ తో ముడిపడి ఉన్నాయి. గర్భాశయం వెలుపల ఎండోమెట్రియం వ్యాప్తి వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది మూత్రాశయం, ప్రేగులపై కానీ అండాశయాల మీద కూడా తీవ్రంగా వ్యాప్తి చెందుతుంది.
పునరుత్పత్తి వయసు కలిగిన 5-10% మహిళలు బాధించే పాలీసిస్టిక్ ఓవరీ నుంచి ఈ రెండు రకాల సిస్ట్ లను వేరు చేయాలి. ఈ రుగ్మత ఆండ్రోజెన్ల అధిక ఉత్పత్తితో ముడిపడి ఉంది (టెస్టోస్టిరాన్ వంటి పురుష హార్మోన్లు) ఇది ఫోలికల్స్ మరియు ఓవా పెరుగుదలకు అంతరాయం కలిగిస్తుంది.

అండాశయ సిస్ట్ కు కారణాలు:

అండాశయ సిస్ట్ లు ఏర్పడటానికి కారణాల్లో ఇవి ఉంటాయి:

 ఫంక్షనల్ సిస్ట్ లు అండాశయాల సాధారణ పనితీరుతో ముడిపడి ఉంటాయి.

 అసిస్టెడ్ రీప్రాడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్టీ) సమయంలో ఉపయోగించే అండాశయ స్టిమ్యులేటింగ్ ఔషధాలను తీసుకున్న తరువాత, లేదా టమోక్సిఫెన్ (కాన్సర్ వ్యతిరేక) లేదా హార్మోన్ ఐయూడీలో లెవోనోర్ జెస్ట్రల్ ఉంటుంది (12 నుంచి 30% మంది మహిళలలో) ఉంచడం ద్వారా కూడా ఇవి సంభవించవచ్చు.

 కొన్ని మాత్రలు, ముఖ్యంగా, అండాశయ సిస్ట్ లు ఎదగడానికి దోహదపడతాయి.

 ఆర్గానిక్ సిస్ట్ ల విషయానికి వస్తే, కారణాలు వాపు స్వభావంపై ఆధారపడి ఉంటాయి. వీటిని ఎండోమెట్రియాసిస్ తో లేదా అండాశయంలో పరిపక్వత లేని కణాల వ్యాప్తికి ముడిపడి ఉండవచ్చు, ఇది అండాశయ సిస్ట్ లకి మరొక కారణం అవుతుంది.

అండాశయంలో సిస్ట్ యొక్క చికిత్స-

అండాశయంలో సిస్ట్ చికిత్సలో ఇవి చేర్చబడతాయి:

ఫంక్షనల్ సిస్ట్ ఉన్నట్లయితే, అది అదృశ్యం కావడానికి ఎలాంటి చికిత్స సిఫారసు చేయబడదు. ఈ అసాధారణ ద్రవ్యరాశులు యాదృచ్ఛికంగా అదృశ్యమయ్యేలా చూడటానికి అల్ట్రాసౌండ్ ద్వారా సరళమైన పర్యవేక్షణ ఉంచబడుతుంది. “తరచుగా ప్రభావితమైన మహిళల్లో, హార్మోన్ల చక్రాన్ని నీయంత్రించడానికి మరియు అండోత్సర్గాన్ని నిరోధించడానికి మాత్రను సూచించవచ్చు, తద్వారా ఫంక్షనల్ సిస్ట్ లు కనిపించకుండా నిరోధించవచ్చు” అని స్పెషలిస్ట్ వైద్యులు చెబుతారు.

 ఫంక్షనల్ సిస్ట్ 3 ఋతుచక్రాలు (సుమారు 3 నెలలు) కొనసాగినట్లయితే, దాని రూపం మారితే లేదా తీవ్రమైన నొప్పి కనిపించినట్లయితే ఆపరేషన్ కు దారి తీస్తుంది. “అయితే, యువతుల అండాశయ నిల్వలను కాపాడటానికి, ముఖ్యంగా పిల్లలు లేనివారికి శస్త్రచికిత్సను తక్కువగా ఉపయోగిస్తారు” అని గైనకాలజిస్టులు చెబుతారు.

 ఆర్గానిక్ సిస్ట్ ఉన్నట్లయితే, (అండాశయ సిస్టక్టమీ) లేదా అండాశయం (ఊఫోరెక్టమీ) అవసరం కావచ్చు. దీనిని సాధారణంగా లాప్రోస్కోపి ద్వారా చేస్తారు, బొడ్డు తెరవకుండా శస్త్రచికిత్స విధానం చేయబడుతుంది.

 అండాశయం మరియు ఇతర ఇన్ఫెర్టిలిటీ చికిత్సల్లో సిస్ట్ చికిత్స గురించి మరింత తెలుసుకొనడం కొరకు, మీ దగ్గరలో ఉన్న ఇందిరా ఐవీఎఫ్ క్లినిక్ ని సందర్శించండి.


Comments

Articles

2022

Infertility Problems Ovarian Cyst

Ovarian Cysts: All You Need to Know

IVF Specialist

Ovarian cyst is the fluid filled sac in ovary. This is one among the most comm...

2022

Infertility Problems Ovarian Cyst

What is Ovarian Hyper stimulation Syndrome (OHSS)?

IVF Specialist

on April 07, 2020 OHSS – WORRISOME BUT NOT AT PRESENT TIMES IN VITRO F...

2022

Infertility Problems Ovarian Cyst

Ovarian Cyst: Causes, Symptoms And Treatment

IVF Specialist

What is an ovarian cyst? Ovarian cysts are fluid filled sacs in or on the s...

Tools to help you plan better

Get quick understanding of your fertility cycle and accordingly make a schedule to track it

© 2024 Indira IVF Hospital Private Limited. All Rights Reserved. T&C Apply | Privacy Policy