PCOS కారణాలు: ఇది ఎందుకు వస్తుంది? ముఖ్య కారణాలు, ప్రమాద కారకాలు మరియు నిరోధించే మార్గాలు

Last updated: February 04, 2026

Overview

ఈ రోజుల్లో ఎక్కడ చూసినా, ముఖ్యంగా టీనేజ్ మరియు పెళ్లి వయసులో ఉన్న అమ్మాయిల్లో తరచుగా వినిపిస్తున్న పేరు PCOS. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుందనే దానికి డాక్టర్లు కూడా 'ఇదే ఖచ్చితమైన కారణం' అని ఒక్క మాటలో చెప్పలేకపోతున్నారు. కానీ, కొన్ని విషయాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి - మన శరీరంలో ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడం, హార్మోన్ల గందరగోళం, అమ్మకో అమ్మమ్మకో ఉంటే మనకు వచ్చే (జెనెటిక్) అవకాశం, అన్నింటికంటే ముఖ్యంగా మన లైఫ్‌స్టైల్ (జీవనశైలి). అసలు PCOS ఎందుకు వస్తుందో మనం కచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే, సమస్యను ముందే గుర్తించి జాగ్రత్తపడితే భవిష్యత్తులో పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు రాకుండా, షుగర్ లేదా గుండె జబ్బుల బారిన పడకుండా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు.
ఈ ఆర్టికల్‌లో, అసలు PCOS రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? ఎవరికి రిస్క్ ఎక్కువ? దీన్ని కంట్రోల్ చేయడానికి మనం ప్రాక్టికల్‌గా ఏం చేయొచ్చు? అనే విషయాలను సింపుల్‌గా మాట్లాడుకుందాం.

పరిచయం

Polycystic Ovary Syndrome (PCOS) అనేది మహిళల్లో ఎక్కువగా కనిపించే ఎండోక్రైన్ (హార్మోన్లకు సంబంధించిన) వ్యాధుల్లో ఒకటి. మీకు PCOS ఉంటే, మీ అండాశయాలు (ఓవరీలు) సాధారణం కంటే ఎక్కువగా ఆండ్రోజెన్స్ అనే సెక్స్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. వీటి వల్ల శరీరంలోని సాధారణ రీప్రొడక్టివ్ హార్మోన్ల (reproductove hormones) సమతుల్యత దెబ్బతింటుంది. అందుకే PCOS ఉన్న మహిళల్లో పీరియడ్స్ క్రమంగా రాకపోవడం, పీరియడ్స్ మిస్సవడం, అలాగే ఏప్పుడు ఒవ్యులేషన్ (Ovulation) జరుగుతుందో అంచనా వేయడం కష్టమవుతుంది.

ఇంతమందికి ఉన్నా సరే, దీనిపై ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి: అసలు నాకెందుకు వచ్చింది?, దీనివల్ల పిల్లలు పుట్టరా?, మాస్టర్బేషన్ (స్వయంక్రీడ) చేసుకోవడం వల్లే ఇలా జరిగిందా? అని చాలామంది అమ్మాయిలు భయపడుతుంటారు. ఈ గైడ్‌లో మనం ఆ అపోహలన్నింటినీ క్లియర్ చేస్తూ, సైన్స్ ఏం చెబుతుందో చూద్దాం. మెడికల్ కారణాలే కాదు మన ఆహారం, బరువు కూడా ఎంత ప్రభావం చూపిస్తాయో వివరంగా తెలుసుకుందాం.

PCOS రావడానికి ప్రధాన కారణాలు

ఒక విషయం గుర్తుంచుకోండి, PCOS అనేది ఏ ఒక్క కారణం వల్లో రాదు. ఇది మన బాడీలోని హార్మోన్లు, మన జీన్స్ (వారసత్వం), మన అలవాట్లు అన్నీ కలిపి చేసే మాయాజాలం.

1. హార్మోన్ల అసమతుల్యత

సాధారణంగా నెలనెలా అండం విడుదల అవ్వడానికి Luteinizing Hormone (LH) మరియు Follicle-stimulating Hormone (FSH) అనే రెండు హార్మోన్లు కరెక్ట్ రేషియోలో ఉండాలి. PCOS ఉన్నవారిలో ఈ బ్యాలెన్స్ తప్పుతుంది (LH హార్మోన్ ఎక్కువైపోతుంది). దీనివల్ల అండం పూర్తిగా ఎదగదు, బయటకు రాదు. అవి లోపలే ఉండిపోయి నీటి బుడగల్లా (Cysts) మారుతాయి. అందుకే పీరియడ్స్ ఆగిపోవడం లేదా లేట్‌గా రావడం జరుగుతుంది. బ్లడ్ టెస్ట్ చేస్తే చాలామందిలో ఈ హార్మోన్ల తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి.

2. ఇన్సులిన్ రెసిస్టెన్స్

ఇది చాలా ముఖ్యమైన పాయింట్. మనం తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చడానికి ఇన్సులిన్ అవసరం. చాలామంది PCOS బాధితుల్లో శరీరం ఈ ఇన్సులిన్‌ను సరిగ్గా వాడుకోలేదు. దాంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి బాడీ ఇంకా ఎక్కువ ఇన్సులిన్‌ను రిలీజ్ చేస్తుంది. ఇలా ఇన్సులిన్ ఎక్కువైతే ఏమవుతుందంటే ఓవరీస్ ఇంకా ఎక్కువ ఆండ్రోజెన్స్ (మగ హార్మోన్లు) ఉత్పత్తి చేస్తాయి. ఫలితంగా బరువు పెరగడం, మెడ నల్లగా మారడం, భవిష్యత్తులో టైప్-2 డయాబెటిస్ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది.ఇన్సులిన్ అనేది రక్తంలో చక్కెర (బ్లడ్ షుగర్) నియంత్రించే హార్మోన్.

3. ఆండ్రోజెన్స్ ఎక్కువ కావడం

ప్రతి అమ్మాయి శరీరంలోనూ కొద్ది మొత్తంలో ఆండ్రోజెన్స్ ఉంటాయి. కానీ PCOS ఉన్నవారిలో ఇవి లిమిట్ దాటిపోతాయి. దీనివల్ల ఓవరీస్ నుంచి అండం విడుదల కావడం ఆగిపోతుంది (anovulation). అంతేకాదు, మొటిమలు (Pimples) రావడం, ముఖం లేదా గడ్డం మీద అవాంఛిత రోమాలు (hirsutism) రావడం, తల జుట్టు పలచబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలామంది PCOS ఉంటే ప్రెగ్నెన్సీ రాదా? అని అడుగుతారు. ఆండ్రోజెన్స్ వల్ల అండం విడుదల కాదు కాబట్టి (ovulatory dysfunction), గర్భం దాల్చడం కాస్త కష్టమవ్వచ్చు, కానీ అసాధ్యం కాదు.

4. బాడీలో చిన్నపాటి వాపు

PCOS ఉన్న మహిళల శరీరంలో లోపల తక్కువ స్థాయిలో దీర్ఘకాలిక వాపు (Internal Swelling) ఉంటుంది. దీనివల్ల ఇన్సులిన్ పనిచేయడం ఇంకా తగ్గిపోయి, హార్మోన్ల సమస్య ఎక్కువవుతుంది. దీనివల్ల త్వరగా అలసిపోవడం, చర్మ సమస్యలు వస్తాయి. అలాగే ఇతర జీవక్రియ రుగ్మతలు (ఉదా: షుగర్, కొలెస్ట్రాల్ సమస్యలు) రావడానికి అవకాశం ఉంటుంది.

5. వారసత్వం (జన్యు కారణాలు)

మీ ఇంట్లో అమ్మకో, అక్కకో, పిన్నికో PCOS గానీ, డయాబెటిస్ (diabetes), పీరియడ్స్ ఆగిపోవడం లేదా లేట్‌గా రావడం గానీ ఉంటే మీకు వచ్చే ఛాన్స్ కొంచెం ఎక్కువే. అలా అని కచ్చితంగా వస్తుందని కాదు. మన చేతుల్లో ఉన్న ఆహారం, వ్యాయామం సరిగా లేకపోతే ఈ జీన్స్ యాక్టివేట్ అయ్యి సమస్య బయటపడుతుంది.

ఇది కూడా చదవండి: PCOS కి ఎన్ని రకాలున్నాయి?

PCOS ని పెంచే ఇతర కారణాలు

ప్రధాన కారణాల‌కు తోడు, మరికొన్ని జీవనశైలి మరియు శరీరానికి సంబంధించిన అంశాలు కూడా PCOS లక్షణాలను మొదలయ్యేలా చేయవచ్చు లేదా అగ్నికి ఆజ్యం పోసినట్టు పనిచేయవచ్చు.

అనారోగ్యకర ఆహారం మరియు కదలికలేని జీవనశైలి

  • స్వీట్స్, జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారం అతిగా తింటే బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది.
  • ఏ పనీ చేయకుండా గంటల తరబడి కూర్చుంటే ఆటోమేటిక్‌గా బరువు పెరుగుతారు, దీనివల్ల హార్మోన్ల ఇబ్బందులు మరింత ముదురుతాయి.
  • హెల్దీగా తింటూ, రోజూ వాకింగ్ చేసే ఆడవారిలో PCOS లక్షణాలు చాలా తక్కువగా కనిపిస్తాయి, వాళ్ళు ఆరోగ్యాన్ని ఈజీగా కంట్రోల్‌లో ఉంచుకోగలరు.

పర్యావరణం

దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ, మనం నిత్యం వాడే ప్లాస్టిక్ వస్తువులు, పండ్లు/కూరగాయల పై చల్లే మందులు, మేకప్ సామాన్లలో ఉండే కొన్ని రసాయనాలు మన హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయని నిపుణులు భావిస్తున్నారు.

ఇతర వైద్య సమస్యలు

థైరాయిడ్, మెటబాలిక్ సమస్యలు, లేదా శరీరంలో ఉండే ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల PCOS లక్షణాలు ఒక్కోసారి మరీ తీవ్రంగా మారొచ్చు లేదా అసలు బయటపడకపోవచ్చు. దీనివల్ల అసలు సమస్య ఏంటో కనిపెట్టి, సరైన టైంలో ట్రీట్‌మెంట్ మొదలుపెట్టడం కాస్త కష్టమవుతుంది.

ఈ కారణాలేవీ లేకపోయినా PCOS రావచ్చా?

అవును, కచ్చితంగా రావచ్చు. కొంతమంది అమ్మాయిలు బరువు తక్కువగా ఉన్నా, ఇంట్లో ఎవరికీ ఈ సమస్య లేకపోయినా సరే PCOS బారిన పడొచ్చు. సన్నగా ఉండే వారిలో కూడా కేవలం పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం లేదా హార్మోన్ల తేడాలు మాత్రమే కనిపించవచ్చు. అందరిలోనూ ఒకే రకమైన లక్షణాలు ఉండవు. అందుకే దీన్ని కేవలం ఒక జబ్బులా కాకుండా, శరీరంలో వచ్చే మార్పుగా గమనించి, ఎవరికి తగ్గ వైద్యం వారు తీసుకోవడం ముఖ్యం.

PCOS ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఏం జరుగుతుంది?

PCOS అనేది కేవలం పిల్లలు పుట్టడానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. దీన్ని సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే, భవిష్యత్తులో ఇతర పెద్ద ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. అందుకే అసలు సమస్య ఎందుకు వచ్చిందో తెలుసుకుని, ఇప్పుడే కంట్రోల్ చేసుకోవడం మీ దీర్ఘకాలిక ఆరోగ్యానికి చాలా మంచిది.

చికిత్స చేయని PCOS వల్ల కలిగే సమస్యలు

  • పిల్లలు పుట్టకపోవడం (Infertility): నెలనెలా అండం విడుదల కాకపోవడం లేదా పూర్తిగా ఆగిపోవడం వల్ల ప్రెగ్నెన్సీ రావడం కష్టమవుతుంది. చాలామంది మహిళలకు పెళ్లయి, పిల్లల కోసం ప్రయత్నిస్తున్నప్పుడే నాకు PCOS ఉంది అనే విషయం మొదటిసారి తెలుస్తుంది.
  • టైప్ 2 డయాబెటిస్: శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా వాడుకోలేకపోవడమే PCOSలో అసలు సమస్య. దీన్ని పట్టించుకోకుండా వదిలేస్తే, అది మొదట 'ప్రీ-డయాబెటిస్'గా మారి, ఆ తర్వాత పర్మనెంట్ 'షుగర్ వ్యాధి (టైప్ 2)'గా మారే ప్రమాదం ఉంది.
  • గర్భాశయ సమస్యలు మరియు క్యాన్సర్ రిస్క్: PCOS ఉన్నవారికి పీరియడ్స్ టైంకి రావు. దీనివల్ల గర్భాశయం లోపలి పొర మీద హార్మోన్ల బ్యాలెన్స్ దెబ్బతింటుంది. ఇలా ఎక్కువ కాలం జరిగితే, ఆ పొర మందంగా మారిపోయి, భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ లేదా ఇతర సీరియస్ సమస్యలు వచ్చే రిస్క్ పెరుగుతుంది.
  • గుండె సంబంధిత సమస్యలు: PCOS ఉన్న మహిళల్లో హై బీపీ రావడం, లేదా రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్స్ తేడా రావడం ఎక్కువగా చూస్తుంటాం. వయసు పెరిగే కొద్దీ ఇది గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసి, హార్ట్ ఎటాక్ లేదా ఇతర గుండె జబ్బుల ముప్పును పెంచే అవకాశం ఉంది.

ఆరంభంలోనే గుర్తించడం మరియు చికిత్స యొక్క ప్రాముఖ్యత

PCOS ఉందని ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. దీనివల్ల వెంటనే మంచి ఆహారం, వ్యాయామం మొదలుపెట్టి బరువును అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే, హార్మోన్ల సమస్యలు ముదరక ముందే మందులు వాడి సరిచేసుకోవడానికి, భవిష్యత్తులో గర్భధారణకు (Pregnancy) ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసుకోవడానికి వీలవుతుంది.

సరైన పర్యవేక్షణ చాలా ముఖ్యం

PCOS అనేది శరీరంలో చాలా రకాల మార్పులకు కారణమవుతుంది. అందుకే కేవలం గైనకాలజిస్టే కాకుండా, అవసరాన్ని బట్టి హార్మోన్ స్పెషలిస్టులు, డైటీషియన్ల సలహాలు కూడా తీసుకోవడం మంచిది. ఇలా నిపుణుల పర్యవేక్షణలో ఉంటేనే పెద్ద ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోగలం.

ముగింపు

మగ హార్మోన్లు (ఆండ్రోజన్లు) ఎక్కువ అవ్వడం, ఇన్సులిన్ పనితీరు దెబ్బతినడం, హార్మోన్ల అసమతుల్యత, మరియు వంశపారంపర్య కారణాలు అన్నీ కలిసి PCOS సమస్యకు దారితీస్తాయి. ఇది ఆడవారి ఆరోగ్యంపై, ముఖ్యంగా పిల్లలు పుట్టే విషయంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల ప్రెగ్నెన్సీ రావడం కష్టమైనప్పటికీ, ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆధునిక వైద్యం, మంచి జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో మార్పుల ద్వారా PCOS ఉన్నా సరే గర్భం ధరించే అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి.

ఇందిరా IVF సెంటర్లలో, PCOS వల్ల పిల్లలు పుట్టక బాధపడుతున్న జంటల కోసం మా నిపుణులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. మీ శరీర తత్వాన్ని బట్టి పర్సనల్ ట్రీట్‌మెంట్ ప్లాన్‌లు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని ఉపయోగించి, తల్లిదండ్రులు కావాలన్న మీ కల నిజం అయ్యేలా మేము అండగా నిలుస్తాము.


ఇది కూడా చదవండి: PCOD vs PCOS

తరచుగా అడిగే ప్రశ్నలు

1. ఆండ్రోజెన్ హార్మోన్లు ఎక్కువైతే మొటిమలు, జుట్టు పెరగడం వంటివి జరుగుతాయా?

 

అవును. మగ హార్మోన్లు (ఆండ్రోజెన్స్) ఎక్కువైనప్పుడు ముఖం నిండా మొటిమలు రావడం, అవాంఛిత రోమాలు పెరగడం, లేదా తల జుట్టు రాలిపోవడం వంటివి చాలా కామన్‌గా జరుగుతుంటాయి.

2. టెన్షన్/ఒత్తిడి వల్ల PCOS వస్తుందా?

 

కేవలం ఒత్తిడి వల్ల మాత్రమే రాదు, కానీ ఎక్కువ కాలం విపరీతమైన స్ట్రెస్ ఉంటే మాత్రం హార్మోన్లు దెబ్బతిని, ఉన్న సమస్య ఇంకా పెద్దదయ్యే అవకాశం ఉంది.

3. కేవలం హార్మోన్ల తేడాల వల్లే PCOS వస్తుందా?

 

కొన్నిసార్లు అంతే. కొందరిలో అండం విడుదల సరిగ్గా లేకపోవడం, ఇన్సులిన్ లేదా ఆండ్రోజెన్ హార్మోన్ల గందరగోళం మాత్రమే ఈ సమస్యకు ప్రధాన కారణం కావొచ్చు.

4. ఫ్యామిలీలో ఎవరికీ లేకపోయినా నాకు రావచ్చా?

 

రావచ్చు. కుటుంబ చరిత్ర లేకపోయినా PCOS వచ్చే అవకాశం ఉంది. కాకపోతే, అమ్మకో, అక్కకో ఉంటే మీకు వచ్చే రిస్క్ ఇంకాస్త ఎక్కువ ఉంటుంది.

5. ఆడవారిలో టెస్టోస్టెరాన్ ఎక్కువైతే PCOS అంటారా?

 

అవును, టెస్టోస్టెరాన్ వంటి మగ హార్మోన్లు ఆడవారిలో ఎక్కువ అవ్వడమే PCOS ప్రధాన లక్షణం. దీనివల్ల సమస్యలు కొంచెం తీవ్రంగా కనిపిస్తాయి

6. PCOS‌ను పూర్తిగా తగ్గించవచ్చా?

 

జీవనశైలి మార్పులు, మందులు, బరువు తగ్గడం ద్వారా దీన్ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. పూర్తిగా మాయం అవుతుందా లేదా అనేది మీ శరీర తీరును బట్టి ఉంటుంది.

7. మనం తినే తిండి PCOS‌పై ప్రభావం చూపిస్తుందా?

 

కచ్చితంగా. స్వీట్లు, మైదా పిండి వంటలు, జంక్ ఫుడ్ ఎక్కువగా తింటే ఇన్సులిన్ సమస్య పెరిగి PCOS ముదురుతుంది. అదే హెల్దీ ఫుడ్ తింటే సమస్య అదుపులో ఉంటుంది.

8. బరువు పెరగడం లక్షణమా, లేక కారణమా?

 

నిజానికి రెండూ. PCOS వల్ల బరువు పెరుగుతారు, అలా పెరిగిన బరువు వల్ల మళ్ళీ ఇన్సులిన్ సమస్య వచ్చి PCOS ఇంకా ఎక్కువ అవుతుంది. ఇదొక సైకిల్ లాంటిది.

9. స్వయంక్రీడ (Masturbation) వల్ల PCOS వస్తుందా?

 

అస్సలు రాదు. స్వయంక్రీడకు, PCOSకు అసలు సంబంధమే లేదు. ఇది కేవలం ఒక అపోహ మాత్రమే.

10. PCOS ఉంటే పిల్లలు పుట్టరా?

 

అలా ఏం లేదు. అండం టైంకి విడుదల కాదు కాబట్టి ప్రెగ్నెన్సీ రావడం కొంచెం ఆలస్యం కావొచ్చు. కానీ సరైన ట్రీట్‌మెంట్ తీసుకుంటే కచ్చితంగా పిల్లలు పుడతారు.

11. PCOS వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా?

 

ఏళ్ల తరబడి పీరియడ్స్ రాకుండా అలాగే ఉండిపోతే, గర్భాశయ పొరలో సమస్యలు వచ్చి క్యాన్సర్ రిస్క్ కొంచెం పెరుగుతుంది. అందుకే రెగ్యులర్ చెకప్స్ చాలా ముఖ్యం.

12. దీనివల్ల అబార్షన్ (గర్భస్రావం) అవుతుందా?

 

PCOS ఉన్నవారిలో ఈ రిస్క్ కొంచెం ఎక్కువే. కానీ షుగర్ లెవల్స్, బరువు, హార్మోన్లను కంట్రోల్‌లో ఉంచుకుంటే గర్భం నిలబడే అవకాశాలు బాగుంటాయి.

**Disclaimer: The information provided here serves as a general guide and does not constitute medical advice. We strongly advise consulting a certified fertility expert for professional assessment and personalized treatment recommendations.
© 2026 Indira IVF Hospital Limited. All Rights Reserved. T&C Apply | Privacy Policy| *Disclaimer